సీఎం కృషితో ఏపీకి పరిశ్రమలు: టీడీపీనాయకులు
CTR: సీఎం చంద్రబాబు విశేష కృషితో ఏపీకి అనేక పరిశ్రమలు వస్తున్నట్లు టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి కిరణ్ కుమార్, గూడూరు పట్టణాధ్యక్షుడు శ్రీనివాసులు తెలిపారు. గూడూరులోని టీడీపీ కార్యాలయంలో నాయకులు మాట్లాడుతూ.. ఏపీలో పెట్టుబడులను ఆకర్షించేందుకు వైజాగ్ సీఐఐ సమ్మిట్ చక్కటి వేదికైందన్నారు. సమావేశంలో భాస్కర్ రెడ్డి, బిల్లు చెంచురామయ్య పాల్గొన్నారు.