రెండో రోజుకు చేరుకున్న కార్మికుల దీక్ష

W.G: ఏపీఎస్ఆర్టీసీ తణుకు డిపో ఆధ్వర్యంలో డిమాండ్లు పరిష్కరించాలని కోరుతూ కార్మికుల రిలే నిరాహార దీక్షలు మంగళవారం రెండో రోజుకు చేరుకున్నాయి. నేషనల్ మజ్దూర్ యూనియన్ సెంట్రల్ కమిటీ ఇచ్చిన పిలుపు మేరకు చేపట్టిన దీక్షలో 1/2019 సర్క్యులర్ ప్రకారం విధి విధానాలు ఉండాలని, 114 జీవో ప్రకారం నైట్ అలవెన్సులు రూ.400 చొప్పున చెల్లించాలని కార్మికులు డిమాండ్ చేశారు.