ఎమ్మెల్యేని కలిసిన మహిళా ప్రధాన కార్యదర్శి

SKLM: కవిటి మండలం రామయ్యపుట్టుగ గ్రామంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ విప్, ఇచ్చాపురం కూటమి ఎమ్మెల్యే బెందాళం అశోక్ బాబును ఆదివారం మర్యాదపూర్వకంగా కలిసినట్లు శ్రీకాకుళం జిల్లా పార్లమెంటరీ తెలుగు మహిళా ప్రధాన కార్యదర్శి ఆశి లీలారాణి తెలిపారు. క్షేత్రస్థాయిలో వివిధ సమస్యలు, పార్టీ పరమైన పలు అంశాలపై చర్చించామని అన్నారు.