జిల్లాలో మహిళా ఓటర్లే ‘కింగ్ మేకర్లు’

జిల్లాలో మహిళా ఓటర్లే ‘కింగ్ మేకర్లు’

భూపాలపల్లి జిల్లాలో ఏ ఎన్నికలైనా గెలుపోటములను నిర్ణయించే శక్తి మహిళా ఓటర్లదే. జిల్లా వ్యాప్తంగా మొత్తం 3,02,147 మంది ఓటర్లు ఉండగా, పురుషులు 1,47,388 మంది కాగా.. మహిళలు 1,54,744 మందితో ఆధిక్యం సాధించారు. 12 మండలాల్లోనూ మహిళా ఓట్లే అధికం. మహిళల ఓటును ఆకర్షించిన అభ్యర్థులే విజయం సాధించే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.