RTC యూనియన్ సంఘాల నేతలతో పొన్నం భేటీ

TG: రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌ను ఆర్టీసీ యూనియన్ సంఘాల నేతలు కలిశారు. వారు తమ సమస్యలను మంత్రి దృష్టికి తీసుకువచ్చారు. దీనికి మంత్రి స్పందిస్తూ.. ఆర్టీసీ ఇప్పుడిప్పుడే కోలుకుంటోందని, సమస్యలు పరిష్కారమవుతున్నాయని, కాబట్టి సమ్మె చేయవద్దని ఆర్టీసీ కార్మికులను కోరారు. గత పదేళ్ల బీఆర్ఎస్ ప్రభుత్వం ఆర్టీసీని నిర్వీర్యం చేసిందని ఆయన విమర్శించారు.