నూతన భవనాలు ప్రారంభించిన ఎమ్మెల్యే

నూతన భవనాలు ప్రారంభించిన ఎమ్మెల్యే

SKLM: పాతపట్నం ఆల్ ఆంధ్ర రోడ్డులో ఉన్నత ప్రజాపరిషత్ పాఠశాలలో నూతనంగా నిర్మించిన అదనపు గదులను ఎమ్మెల్యే ఎంజీఆర్ గురువారం ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. పాఠశాలలో అదనపు గదులు నిర్మాణానికి శాసనపురి మహేశ్వరరావు పరమేశ్వరి దంపతులు ఆర్థిక సహాయం అందించారని తెలిపారు. విద్యను ప్రోత్సహించి వారు గదులు నిర్మించడం అభినందనీయం అన్నారు.