ఆసియా కప్ తరహాలో కొత్త టోర్నీ..!
క్రికెట్‌లో ఆసియా కప్ తరహాలోనే యూరప్ దేశాల కోసం ‘యూరో నేషన్స్ కప్’ నిర్వహించేందుకు క్రికెట్ ఐర్లాండ్ ప్రయత్నాలు చేస్తోంది. 2027లో ఈ టోర్నీ ప్రారంభం కావచ్చని తెలుస్తోంది. ఇందులో ఇంగ్లండ్, ఐర్లాండ్, స్కాట్లాండ్, నెదర్లాండ్స్, ఇటలీ జట్లు తలపడే అవకాశం ఉంది. దీనిపై త్వరలోనే అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది.