హోలీకి ఆ గ్రామంలో వింత ఆచారం.!
KRNL: హోలీ అంటేనే కామ దహనం, ఒకరికి ఒకరు రంగులు చల్లుకోవడం, ఆటపాటలతో సరదాగా గడపడం. ఆదోని మండలం సంతకుళ్లారులో ఓ వింత ఆచారం కొనసాగుతోంది. పురుషులు చీర కట్టుకుని ఆడవారిలా తయారవుతారు. చిన్నారులు కూడా బాలికల మాదిరిగా వస్త్రాలు ధరించి పూలు పెట్టుకొని ముస్తాబవుతారు. అనంతరం రతీమన్మథులకు పూజలు చేస్తారు. ఈ ఆచారం తరతరాలుగా కొనసాగుతోందని గ్రామస్థులు తెలిపారు.