VIDEO: జాతరలో దాడి ఘటనపై విచారణ
అన్నమయ్య: మదనపల్లె మండలం వేంపల్లిలో ఈనెల 13న జరిగిన గంగమ్మ జాతరలో డ్రమ్స్ వాయిస్తున్న దళితులపై ఎస్సై రామకృష్ణారెడ్డి దాడి చేసినట్లు ఆరోపణలు వచ్చాయి. ఈ ఘటనపై బాధితులు రాష్ట్ర ఎస్సీ కమిషన్‌ను ఆశ్రయించగా, కమిషన్ సభ్యులు గౌతంరాజు, డా. బాబుశ్రీపతి, బిక్షం ఇవాళ గ్రామానికి చేరుకున్నారు. సీఐ కళావెంకటరమణ సమక్షంలో త్రీమెన్ కమిటీగా పూర్తి వివరాలు సేకరించారు.