VIDEO: సంజయ్ దత్ అతన్ని అలా కొట్టారేంటి?

బాలీవుడ్ సీనియర్ నటుడు సంజయ్ దత్ ఓ అభిమానికి సరదాగా సెల్ఫీ ఇచ్చిన తీరుకు నెటిజన్లు ఫిదా అవుతున్నారు. రోడ్డు పక్కన ఉన్న ఓ రెస్టారెంట్ దగ్గర నిలబడి ఉన్న సంజయ్ దగ్గరికి ఓ అభిమాని.. సెల్ఫీ తీసుకోవడానికి వచ్చాడు. అయితే అతని ఫోన్ కెమెరా ఆన్ కాలేదు. దీంతో సంజయ్ ఆ వ్యక్తి తల మీద చిన్నగా కొట్టి నవ్వుతూ సెల్ఫీ ఇచ్చారు. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.