VIDEO: పలు అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే శంకుస్థాపన

VIDEO: పలు అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే శంకుస్థాపన

గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో శుక్రవారం పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన కార్యక్రమాలు జరిగాయి. 39,42,43వ డివిజన్‌లలో రూ.3.50 కోట్ల వ్యయంతో నిర్మించనున్న సీసీ రోడ్లు, డ్రైన్‌లకు ఎమ్మెల్యే మాధవి భూమి పూజ చేశారు. వర్షాకాలంలో అనేక కాలనీలు నీట మునిగి, ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని ఆమె చెప్పారు. డ్రైన్‌లను పూర్తి స్థాయిలో ఆధునీకరిస్తామన్నారు.