గ్రామాలలో చివరి రోజు పోటాపోటీ ప్రచారం

గ్రామాలలో చివరి రోజు పోటాపోటీ ప్రచారం

నాగర్ కర్నూల్ జిల్లా కల్వకుర్తి నియోజకవర్గంలో గ్రామపంచాయతీ ఎన్నికల ప్రచారానికి మంగళవారం చివరి రోజు కావడంతో, వివిధ పార్టీల మద్దతుదారులు ఇంటింటికీ వెళ్లి ఓట్లు అభ్యర్థిస్తూ.. పోటాపోటీగా ప్రచారం నిర్వహించారు. అభ్యర్థులు తాము గెలిస్తే గ్రామంలోని సమస్యలను పరిష్కరిస్తామని, ప్రజలకు అందుబాటులో ఉండి సేవ చేస్తామని హామీలు గుప్పించారు.