సుఖోయ్-30 MKI కూలిపోయింది: వాయుసేన

సుఖోయ్-30 MKI కూలిపోయింది: వాయుసేన

కనిపించకుండాపోయిన సుఖోయ్-30 MKI విమానం అసోం కర్బి ఆంగ్లాంగ్ జిల్లాలో కూలిపోయినట్లు వాయుసేన ప్రకటించింది. శిక్షణ సమయంలో ఈ ప్రమాదం జరిగినట్లు వెల్లడించింది. జోర్హాట్ నుంచి 60 కిలోమీటర్ల దూరంలో ఈ ఘటన జరిగినట్లు తెలిపింది. అయితే ఈ యుద్ధ విమానం ఖరీదు రూ.1000 కోట్లకుపైగా ఉంటుందని అంచనా.