గడ్డి మందు తాగి మహిళ మృతి
NLG: నకిరేకల్ మండలంలోని తాటికల్ గ్రామంలో భార్యాభర్తల కలహాలు విషాదానికి దారితీశాయి. సైదమ్మ(30) మానసిక కలత చెంది గడ్డి మందు తాగి ఆత్మహత్యాయత్నం చేసింది. కుటుంబ సభ్యులు ఆమెను నల్గొండలోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించగా, చికిత్స పొందుతూ మృతి చెందింది. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.