పోలీస్ స్టేషన్‌లను తనిఖీ చేసిన ఎస్పీ

పోలీస్ స్టేషన్‌లను తనిఖీ చేసిన ఎస్పీ

VKB: జిల్లాలో పంచాయతీ ఎన్నికల దృష్ట్యా ఎస్పీ స్నేహ మెహ్రా మంగళవారం నవాబ్ పేట్ పోలీస్ స్టేషన్‌ను ఆకస్మికంగా సందర్శించారు. ఈ సందర్భంగా ఆమె స్టేషన్‌లోని రికార్డులు, రిసెప్షన్, వివిధ విభాగాల పనితీరును క్షుణ్ణంగా పరిశీలించారు. ఎన్నికల సమయంలో సిబ్బంది నిరంతరం అప్రమత్తంగా వ్యవహరించాలని ఆమె సూచించారు.