రోడ్డుమీద ఇష్టానుసారంగా వాహనాల పార్కింగ్

రోడ్డుమీద ఇష్టానుసారంగా వాహనాల పార్కింగ్

AKP: నర్సీపట్నం సీబీఎం కాంపౌండ్ వద్ద గల ఫిష్ మార్కెట్ ఆదివారం వచ్చిందంటే జాతర వాతావరణం నెలకొంటుంది. చేపలను కొనుగోలు చేయడానికి వచ్చిన కొనుగోలుదారులు రోడ్డుమీద ఇష్టానుసారం తమ వాహనాలను పార్కింగ్ చేస్తున్నారు. దీనివలన ఆ ప్రాంతంలో విపరీతమైన ట్రాఫిక్ జామ్ ఏర్పడుతుంది. చింతపల్లికి వెళ్లే ప్రధాన రహదారి కావడంతో పరిస్థితి అధ్వాన్నంగా తయారవుతుందని స్థానికులు ఆరోపిస్తున్నారు.