VIDEO: యూరియా కోసం బారులు తీరిన రైతులు

WGL: గత కొన్ని రోజులుగా యూరియా కొరత రైతులను కంటిమీద కునుకు లేకుండా చేస్తుంది. గురువారం ఉదయాన్నే చెన్నారావుపేట మండల కేంద్రంలో యూరియా కోసం రైతులు బారులు తీరారు. పెద్ద ఎత్తున ఒకేసారి మహిళా రైతులు క్యూ లైన్లలో నిలబడ్డారు. పంట సాగులో రెండోసారి యూరియాను వెదజల్లే సమయం ఆసన్నం కావడంతో అన్నదాతలు తీవ్ర అవస్థలు పడుతున్నారు.