'ఆదివాసీలకు కనీస మౌలిక వసతులు కల్పించాలి'
BDK: తెలంగాణ రైతు కూలీ సంఘం (AIKMKS) భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో పాల్వంచలో భారీ ర్యాలీ- సదస్సును మంగళవారం నిర్వహించారు. ఈ సమావేశంలో సీపీఐ(ఎంఎల్) కేంద్ర కమిటీ నాయకులు మాట్లాడారు. ఆదివాసీ గ్రామాల్లో రోడ్లు, కరెంటు, మంచినీటి సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఆదివాసీలకు పోడుభూమికి వెంటనే హక్కు పత్రాలు కల్పించాలన్నారు.