430 గ్రాముల పాపి స్ట్రా పౌడర్ పట్టివేత

430 గ్రాముల పాపి స్ట్రా పౌడర్ పట్టివేత

MDK: తూప్రాన్ టోల్ ప్లాజా వద్ద 430 గ్రాముల పాపి స్ట్రా పౌడర్ పట్టుకున్నట్లు నర్సాపూర్ ఎక్సైజ్ సీఐ గులాం ముస్తఫా తెలిపారు. టోల్ ప్లాజా వద్ద వాహన తనిఖీలు నిర్వహించగా బస్సులో ప్రయాణిస్తున్న రాజస్థాన్‌కు చెందిన రావల్ సింగ్ (33) వద్ద 430 గ్రాముల పాపి స్ట్రా లభించినట్లు తెలిపారు. దాడుల్లో ఎస్సై కాజా అజీజ్ అహ్మద్ సిబ్బంది  ఉన్నారు.