హోంగార్డు కుటుంబానికి ఆర్థిక సాయం

JGL: మెట్‌పల్లిలో ఇటీవల రోడ్డు ప్రమాదంలో మరణించిన హోంగార్డు సుబ్బరాజు కుటుంబానికి మెట్‌పల్లి పోలీసులు ఆర్థిక సహాయం అందజేశారు. మృతి చెందిన హోంగార్డు కుటుంబం పేదరికంతో ఉండడంతో డీఎస్పీ ఉమామహేశ్వరరావు, సీఐ నిరంజన్ రెడ్డి కలిసి మెట్‌పల్లి పోలీసుల తరఫున రూ .50వేల రూపాయలను సుబ్బరాజు కుటుంబానికి అందించి పరామర్శించారు.