U-19 టీంలో హైదరాబాద్ యువకుడికి చోటు
HYD: నాంపల్లిలోని మల్లెపల్లికి చెందిన యువ ఫాస్ట్ బౌలర్ మహమ్మద్ మాలిక్ BCCI అండర్-19 ఇండియా-A టీమ్‌లోకి ఎంపికయ్యాడు. మాలిక్ మాట్లాడుతూ.. ఇటీవల జరిగిన వినూ మాంకడ్ ట్రోఫీలో టాప్ వికెట్ టేకర్‌గా నిలవడంతో ఈ అవకాశం దక్కిందన్నారు. భారత జట్టుకు ప్రాతినిధ్యం వహించడమే తనకల అని పేర్కొన్నారు. ఈనెల 17న బెంగళూరు వేదికగా ఆఫ్ఘనిస్తాన్‌తో జరిగే సిరీస్‌లో పాల్గొననున్నారు.