కాళీమాత ఆలయంలో కుంకుమ పూజలు

కాళీమాత ఆలయంలో కుంకుమ పూజలు

SKLM: ఇచ్చాపురం మున్సిపాలిటీ బలరాంపేటలో ఆదివారం సింహ సంక్రమాణం సందర్భంగా ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ మేరకు శ్రీ కాళీమాత, సాయిబాబా ఆలయ కమిటీ ఆధ్వర్యంలో కాళీమాతకు మహిళలు భక్తిశ్రద్ధలతో కుంకుమ పూజలు చేశారు. అన్న ప్రసాదం కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమంలో కమిటీ సభ్యులు, మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.