ముగిసిన మొదటి విడత జనగణన శిక్షణ
MDK: చేగుంట మండలం వడియారం ఉన్నత పాఠశాలలో 3 రోజుల పాటు నిర్వహించిన మొదటి విడత జనగణన శిక్షణ కార్యక్రమం ముగిసింది. ఈ శిక్షణలో 42 మంది ఉపాధ్యాయులకు ఇద్దరు మాస్టర్ ట్రైనర్లు జనగణన ప్రక్రియపై పూర్తి అవగాహన కల్పించారు. వచ్చే నెల 11వ తేదీ నుంచి హౌస్ లిస్టింగ్ ప్రక్రియ ప్రారంభించాలని అధికారులు సూచించారు. అనంతరం ఎన్యుమరేటర్లకు ట్రైనింగ్ కిట్లను పంపిణీ చేశారు.