ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నాలు సాగవు: మాజీ MLA
HNK: కాళేశ్వరం ప్రాజెక్ట్ పై పీసీ ఘోష్ కమిషన్ నివేదికకు హైకోర్టు స్టే ఇవ్వడాన్ని పరకాల మాజీ MLA చల్లా ధర్మారెడ్డి స్వాగతించారు. ఇవాళ పరకాల పట్టణంలో ఆయన మాట్లాడుతూ.. ఇది కాంగ్రెస్ ప్రభుత్వానికి ఎదురుదెబ్బ అని పేర్కొన్నారు. కాళేశ్వరం తెలంగాణకు జీవాధారమని, రైతుల అభివృద్ధికి కీలకమని తెలిపారు. ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నాలు ఇక సాగవని అన్నారు.