హుస్నాబాద్ డిపో ఆర్టీసీ కార్మికుల ఆందోళన

హుస్నాబాద్ డిపో ఆర్టీసీ కార్మికుల ఆందోళన

సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ ఆర్టీసీ డిపోలో కార్మికుల జేఏసీ సమ్మెతో రవాణా సేవలు స్థంభించాయి. కార్మికులు విధులను బహిష్కరించి డిపో ఎదుట ఆందోళన చేపట్టారు. ఫలితంగా 63 బస్సులు నిలిచిపోయాయి. బస్టాండ్ ఖాళీగా మారగా, ప్రయాణికులు ప్రైవేట్ వాహనాలపై ఆధారపడుతున్నారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు పటిష్ట బందోబస్తు నిర్వహిస్తున్నారు.