పరిసర ప్రాంతాలలో పరిశుభ్రత పాటించాలి: కలెక్టర్

పరిసర ప్రాంతాలలో పరిశుభ్రత పాటించాలి: కలెక్టర్

KMR: జిల్లా కేంద్రంలోని రామారెడ్డి రహదారి, వైష్ణవి ఆసుపత్రి సమీపంలోని శానిటేషన్‌ను కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ మంగళవారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆ ప్రదేశాన్ని ప్రత్యక్షంగా పరిశీలించి, మున్సిపల్ సిబ్బందితో మాట్లాడుతూ.. పరిసర ప్రాంతాలలో పరిశుభ్రత పాటించి చెత్త ఉండకుండా వెంటనే శుభ్రత పనులను వేగవంతం చేయాలని ఆదేశించారు.