అశ్వారావుపాలెం వంతెన పరిశీలించిన ఎమ్మెల్యే

కృష్ణా: అవనిగడ్డ మండలం అశ్వారావుపాలెంలో ఒకటో నెంబర్ పంట కాలువపై వంతెన సమస్యను ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ శుక్రవారం పరిశీలించారు. ఇటీవల భారీ వర్షాలకు వంతెన శ్లాబు కొంత కూలిపోగా మిగిలిన భాగం బీటలు వారి పూర్తిగా దెబ్బతిని ఉంది. ఈ సమస్యను పరిశీలించిన ఎమ్మెల్యే అధికారులకు ఫోన్ చేసి సమస్య పరిష్కారానికి అంచనాలు రూపొందించాలని ఆదేశించారు.