గుణానపురం గ్రామ సమీపంలో ఏనుగుల గుంపు
PPM: కొమరాడ మండలం పాత గుణానపురంగ్రామ సమీపంలో ఏనుగుల గుంపు సంచరిస్తున్నట్లు అటవీశాఖ సిబ్బంది బుధవారం ఉదయం తెలిపారు. చుట్టుపక్కల రైతులు పంట పొలాలకు వెళ్లే సమయంలో జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు.ఏనుగుల గుంపు బాసింగి వైపు వెళ్లే అవకాశం ఉన్నట్లు చెబుతున్నారు. ఏనుగులు కనిపిస్తే కవ్వింపు చర్యలకు పాల్పడరాదన్నారు.