మద్యం, నగదు పంచితే సమాచారం ఇవ్వండి :ఎస్పీ

మద్యం, నగదు పంచితే సమాచారం ఇవ్వండి :ఎస్పీ

జగిత్యాల జిల్లాలో గ్రామ పంచాయతీ ఎన్నికల సందర్భంగా ప్రతి ఒక్క గ్రామంలో పోలీసులు సూచించిన నియమాలను పాటించాలని ఎస్పీ అశోక్ కుమార్ తెలిపారు. ఓటర్లు తమ వెంట గుర్తింపు కార్డులను తెచ్చుకోవాలన్నారు. పోలీస్ యంత్రాంగం పకడ్బందీగా విధులను నిర్వహిస్తుందని అన్నారు. డబ్బు, మద్యం, బహుమతులు పంచే క్రమంలో పోలీసులకు సమాచారం అందించాలని,వారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు.