అధికారులకు పవన్ కళ్యాణ్ కీలక ఆదేశాలు
AP: ప్రముఖ ఆలయాల్లో భక్తుల భద్రత, సౌకర్యాల కల్పనపై ప్రత్యేక దృష్టి పెట్టాలని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు. ప్రముఖ క్షేత్రాలు అన్నవరం, పాదగయ పిఠాపురం, పంచారామం, సామర్లకోటతోపాటు ఇతర ఆలయాల్లో ఏర్పాట్లపై ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని అధికారులకు ఆదేశించారు. దేవాదాయ, పోలీస్, పంచాయతీరాజ్, మున్సిపల్, రెవెన్యూ శాఖలు సమన్వయంతో పని చేయాలని పిలుపునిచ్చారు.