ఏయూ శతాబ్ధి ఉత్సవాలకు రూ.170 కోట్లు!
AP: విశాఖ ఆంధ్ర యూనివర్సిటీ(ఏయూ) 2026 ఏప్రిల్‌లో వందేళ్లను పూర్తి చేసుకోనుంది. దీన్ని దృష్టిలో ఉంచుకొని ఏయూ రూ.170 కోట్లతో అభివృద్ధి ప్రణాళికను రూపొందించింది. కేంద్ర ప్రభుత్వ పూర్వోదయ స్కీమ్ కింద వసతిగృహాలు, విద్యాలయ బ్లాకుల అభివృద్ధి, కొత్త సిబ్బంది నివాసాలు, పరిపాలన భవనాల ఆధునికీకరణ చేపట్టనున్నారు. ఏయూ ఇప్పటికే ఈ ప్రతిపాదనలను కేంద్ర ప్రభుత్వానికి సమర్పించింది.