మంగళగిరిలో పందెం కోళ్లు చోరీ

మంగళగిరిలో పందెం కోళ్లు చోరీ

GNTR: మంగళగిరి పరిధిలోని నిడమర్రులో పందెం కోళ్ల దొంగతనం కలకలం రేపింది. మండెపూడి లాజరు, కృష్ణ అనే వ్యక్తులు పెంచుకుంటున్న రూ. 2.50 లక్షల విలువైన 40 కోళ్లను గుర్తుతెలియని వ్యక్తులు ఎత్తుకెళ్లారు. ఈ నెల 7, 8 తేదీల్లో దొంగలు ఫామ్‌లోకి చొరబడి కాపలాదారుడిని కత్తితో గాయపరిచి కోళ్లను తీసుకెళ్లినట్లు బాధితులు మంగళవారం పోలీసులకు ఫిర్యాదు చేశారు.