జనావాసాల్లో నెమలి

జనావాసాల్లో నెమలి

NLG: నిడమనూరుకి చెందిన ఈశ్వర్ ఇంటి సమీపంలో నెమలి సంచరిస్తున్నట్లు సోమవారం సాయంత్రం స్థానికులు గుర్తించారు. వెంటనే నిడమనూరు ఎస్సై ఉప్పు సురేష్‌కు సమాచారం ఇవ్వగా ఆయన అక్కడికి చేరుకున్నారు. అనంతరం ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ విక్రమ్‌కు సమాచారం అందించారు. అక్కడికి వచ్చిన ఫారెస్ట్ బీట్ ఆఫీసర్‌కు పోలీసులు నెమలిని అప్పగించారు.