ఎచ్చెర్ల ఎమ్మెల్యే రేపటి కార్యక్రమ వివరాలు

ఎచ్చెర్ల ఎమ్మెల్యే రేపటి కార్యక్రమ వివరాలు

SKLM: ఎచ్చెర్ల ఎమ్మెల్యే నడుకుదిటి ఈశ్వరరావు బుధవారం పర్యటన వివరాలను ఆ పార్టీ కార్యాలయం నుంచి మంగళవారం ఒక ప్రకటనలో వెల్లడించారు. బుధవారం సాయంత్రం 4 గంటలకు జి.సిగడాం మండలంలోని గెడ్డకంచారంలో నమస్తే ఎచ్చెర్ల - మన ఊరికి మన ఎమ్మెల్యే కార్యక్రమం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమానికి కూటమి నేతలు, స్థానికులు, ప్రజలు, కార్యకర్తలు హాజరుకావాలన్నారు.