నేడు మెళియాపుట్టిలో పీజీఆర్ఎస్
SKLM: మెళియాపుట్టి మండల పరిషత్ కార్యాలయంలో శుక్రవారం ఐటీడీఏ ఆధ్వర్యంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక నిర్వహించనున్నట్లు ITDA పీవో పవార్ స్వప్నిల్ జగన్నాథ్ గురువారం తెలిపారు. టెక్కలి డివిజన్, మెళియాపుట్టి మండల స్థాయి అధికారులు తప్పనిసరిగా హాజరు కావాలని స్పష్టం చేశారు. గిరిజన గ్రామాల ప్రజలు వినతులను అందజేయాలని కోరారు.