రాష్ట్రస్థాయి నవోదయ మోడల్ పరీక్షలో యోజిత్ ప్రతిభ
SKLM: ఆమదాలవలస మండలం నిమ్మతోర్లాడ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలకు చెందిన యోజిత్ రాష్ట్రస్థాయిలో జరిగిన నవోదయ మోడల్ పరీక్షలో రెండో ర్యాంక్ సాధించాడు. ఇటీవల అనకాపల్లిలో హెచ్‌వీఎన్ అకాడమి పరీక్షను నిర్వహించారు. ఇటీవల విడుదల చేసిన మోడల్ పరీక్ష ఫలితాల్లో యోజిత్ రెండో ర్యాంకు సాధించగా నిర్వాహకులు విద్యార్థికి సోమవారం రూ. 12,500 క్యాష్ బహుమతి, మెమొంటో అందజేశారు.