'టీడీపీలో సీనియర్ నాయకులకు విలువ లేదు'

W.G: టీడీపీలో సీనియర్ నాయకులకు విలువ లేదని తాడేపల్లిగూడెం మండలం దండగ గ్రామ సర్పంచ్ పిల్ల రాంబాబు ఆవేదన వ్యక్తం చేశారు. 2009 నుంచి పార్టీ కోసం కష్టపడినా ఆరుగొలను సొసైటీ ఎన్నికల్లో గ్రామ నాయకులను పట్టించుకోలేదని ఆరోపించారు. పార్టీ అధిష్టానం కార్యకర్తలను గౌరవించాలని పేర్కొన్నారు. ఈ విషయం అధిష్టానానికి చేరాలని కోరారు.