నరసన్నపేటలో వర్షం.. ఆందోళనలో రైతులు

నరసన్నపేటలో వర్షం.. ఆందోళనలో రైతులు

SKLM: దిత్వా తుఫాన్ ప్రభావంతో సోమవారం తెల్లవారజామున నరసన్నపేటతో పాటు పలు గ్రామాల్లో వర్షం పడింది. రైతులు పండించిన ధాన్యం అమ్మకాలు చేపట్టేందుకు దారులపైనే ధాన్యం ఆరబెట్టుకుంటున్నారు. ఈ సమయంలో వర్షాలు పడుతుండటంతో ఆందోళన చెందుతున్నారు. కొన్నిచోట్ల వరి కోతలు నిలిపివేశారు. ధాన్యం కొనుగోలు కాకపోవడంతో ఇబ్బందులు పడుతున్నామని రైతులు తెలిపారు.