ఆస్తులు ధ్వంసం చేస్తే కఠిన చర్యలు: ఎస్పీ వినీత్
NRPT: జిల్లాలో ఆర్టీసీ సమ్మె దృష్ట్యా శాంతిభద్రతల కోసం కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసినట్లు ఎస్పీ డా. వినీత్ తెలిపారు. బస్సులు, ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేసేవారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. విధుల్లో ఉన్న సిబ్బందికి పూర్తి భద్రత కల్పిస్తామని, ప్రజలు వదంతులను నమ్మవద్దని ఆయన స్పష్టం చేశారు.