ముగిసిన చిరంజీవి, ఫిల్మ్ ఫెడరేషన్ సభ్యుల భేటీ

నటుడు చిరంజీవితో ఫిల్మ్ ఫెడరేషన్ సభ్యులు సమావేశమై వారి సమస్యలను వినిపించారు. ప్రతి యూనియన్‌తో విడిగా మాట్లాడి వారి సమస్యలను తెలుసుకున్నారు. ఈ సమావేశం తర్వాత రేపు సాయంత్రం 4 గంటలకు ఫెడరేషన్, ఫిల్మ్ ఛాంబర్ ప్రతినిధులు మరోసారి సమావేశం కానున్నారని సమాచారం. ఈ సమావేశంలో సభ్యుల సమస్యలపై చర్చించి తగిన పరిష్కారాలు చూపే అవకాశం ఉంది.