గణేష్ మండపం వద్ద జూదం.. 8 మందిపై కేసు

గణేష్ మండపం వద్ద జూదం.. 8 మందిపై కేసు

ఆదిలాబాద్: జిల్లా కేంద్రంలోని శాంతినగర్ కాలనీలో ఓ గణేష్ మండపం వద్ద జూదం ఆడుతున్న ఎనిమిది మందిని అదుపులోకి తీసుకున్నట్లు వన్ టౌన్ సీఐ సునిల్ కుమార్ మంగళవారం తెలిపారు. వారి వద్ద నుంచి రూ. 18, 520 నగదు, మూడు సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు. 8 మందిపై కేసు నమోదు చేసినట్లు పేర్కొన్నారు.