బేగంపేటలో విమానం వేలం.. కొనేవాళ్లు రెడీనా?
ఫాల్కన్ గ్రూప్ స్కామ్ కేసులో సీజ్ చేసిన 'హాకర్ 800' విమానాన్ని వేలం వేయాలని ఈడీ నిర్ణయించింది. ఈనెల 9న బేగంపేట ఎయిర్‌పోర్ట్‌లో MSTC ద్వారా ఈ వేలం జరగనుంది. మెయింటెనెన్స్ ఖర్చు తడిసి మోపెడవుతుండటంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. విమానం అమ్మగా వచ్చిన డబ్బును స్కామ్‌లో బాధితులకు ఇస్తామని ఈడీ తెలిపింది. కాగా, 2024లో దీన్ని 1.6 మిలియన్ డాలర్లతో కొనుగోలు చేశారు.