కారు ప్రమాదం.. భార్యభర్తలు మృతి

కారు ప్రమాదం.. భార్యభర్తలు మృతి

AP: తూర్పు గోదావరి జిల్లాలో కారు పంట కాలువలోకి దూసుకెళ్లడంతో భార్యభర్తలు ప్రాణాలు కోల్పోయారు. మృతులను వెలగతోడుకు చెందిన భోగిల్లి సతీష్(40), కిరణ్మయి(36)గా గుర్తించారు. మండపేట మం. తాపేశ్వరం వద్ద ఈ ఘటన జరగ్గా.. గమనించిన స్థానికులు వెంటనే సతీష్ తల్లిదండ్రులు, ఇద్దరు పిల్లలను రక్షించారు. కాకినాడలో పెళ్లికి వెళ్లి వస్తుండగా ఈ ఘటన జరిగినట్లు సతీష్ తల్లిదండ్రులు తెలిపారు.