బాలయ్యను కలిసిన సర్పంచ్ వినోద్

సత్యసాయి: గోరంట్ల మండలం రెడ్డిచెరువుపల్లి సర్పంచ్ ఘట్టంనేని వినోద్ కుమార్ నందమూరి బాలకృష్ణను కలిశారు. ఆదివారం హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణను సర్పంచ్ వినోద్ మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛం అందించి, అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా బాలయ్య చిన్న వయసులోనే సర్పంచ్ అయ్యావని, ప్రజల సమస్యలు తీర్చి, వారి రుణం తీర్చుకోవాలని వినోద్‌కు సూచించారు.