మంత్రిపై వైసీపీ విద్యార్థి విభాగం నేతల విమర్శలు

మంత్రిపై వైసీపీ విద్యార్థి విభాగం నేతల విమర్శలు

ATP: వైద్య కళాశాల భవనాలపై మంత్రి సవిత చేసిన వ్యాఖ్యలను వైసీపీ విద్యార్థి విభాగం నేతలు తీవ్రంగా విమర్శించారు. గుంతకల్లు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వంశి యాదవ్ పెనుగొండ వైద్య కళాశాల వద్ద సెల్ఫీలు దిగారు. 'ఇవి మా జగనన్న కట్టించిన మెడికల్ కాలేజీ బిల్డింగ్‌లు. మీకు కనిపించడం లేదా?' అని ప్రశ్నించారు. కూటమి నేతలు కళ్లుండి కబోదిలా వ్యవహరిస్తున్నారని వారు అన్నారు.