ప్రమాదవశాత్తు కింద పడి మత్స్యకారుడు మృతి

ప్రమాదవశాత్తు కింద పడి మత్స్యకారుడు మృతి

MHBD: తొర్రూరు మండలంలోని అమ్మాపురం గ్రామానికి చెందిన మత్స్యకారుడు గుంటుక యాకయ్య(59) శనివారం గ్రామంలోని పెద్ద చెరువులో చేపల వేటకు వెళ్లాడు. తిరిగి సైకిల్‌పై ఇంటికొస్తున్న క్రమంలో ప్రమాదవశాత్తు కింద పడి మృతి చెందాడు. మృతుడికి భార్య పద్మ, కుమారుడు సతీష్ ఉన్నారు. యాకయ్య మృతి పట్ల పలువురు నాయకులు సంతాపం తెలిపారు.