రోడ్డు ప్రమాదం.. పలువురికి గాయాలు
KMM: నేలకొండపల్లి మండలంలోని పైనంపల్లి టోల్ ప్లాజా సమీపంలో ఇవాళ ఉదయం రెండు కార్లు ఢీకుని ప్రమాదం జరిగింది. హైవేపై యూటర్న్ తీసుకుంటున్న కారును, కోదాడ వైపు నుంచి వేగంగా వస్తున్న మరో కారు బలంగా ఢీకొంది. ఈ ప్రమాదంలో పలువురు ప్రయాణికులకు స్వల్ప గాయాలయ్యాయి. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.