యువకుడు ఆత్మహత్య

యువకుడు ఆత్మహత్య

MDK: పాపన్నపేట మండలం కొత్తపల్లి గ్రామంలో గడ్డమీది ఉమేష్ ముదిరాజ్ (23) ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. కుటుంబ సమస్యలతో రాత్రి ఇంట్లోంచి బయటకు వెళ్లిపోయి, సోదరికి ఫోన్ చేసి చనిపోతున్నట్లు చెప్పడంతో అతని కోసం గాలించారు. ఆచూకీ లభించకపోగా ఉదయం స్కూల్ వెనకాల చెట్టుకు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నట్లు గుర్తించారు.