రైతుల అభివృద్ధే ప్రభుత్వం లక్ష్యం: రవికుమార్

రైతుల అభివృద్ధే ప్రభుత్వం లక్ష్యం: రవికుమార్

SKLM: జి.సిగడాం మండలంలోని ముసినివలస గ్రామ పంచాయతీలో శుక్రవారం “రైతన్న మీకోసం” కార్యక్రమం నిర్వహించారు. టీడీపీ మండల పార్టీ అధ్యక్షుడు కుమరాపు రవికుమార్ నేతృత్వంలో గ్రామంలోని ప్రతి ఇంటికి తిరుగుతూ రైతు కరపత్రాలను పంపిణీ చేశారు. కూటమి ప్రభుత్వం రైతులకు అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను వివరిస్తూ, రైతుల అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు.