మట్టి ప్రతిమలు పంపిణీ చేసిన ఎంపీ

MBNR: వినాయక చవితి పర్వదినం సమీపిస్తున్న సందర్భంగా ఎంపీ డీకే అరుణ నేడు నగరంలో పద్మావతి కాలనీలోని క్యాంపు కార్యాలయంలో విద్యార్థులు, జర్నలిస్ట్‌లు, స్థానికులు, పార్టీ కార్యకర్తలకు మట్టి ప్రతిమలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. పర్యావరణహితంగా ప్రతి ఒక్కరు మట్టి విగ్రహాలను పూజించాలని సూచించారు. కార్యక్రమంలో ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.